పోస్ట్‌లు

చిత్రం
  పుటల కిటికీలు  ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గదిలో గాజు బీరువా తలుపు రెక్క తప్పించి చూస్తే నిలువెత్తునా పలుకరిస్తూ పుస్తకాలు అవి నిత్య జీవన మహోత్సవంలో అక్షర కుటిలో ఒదిగే మేధాకేదారాలు  గతానికీ స్వగతానికీ జరిగిన సంఘర్షణోద్యోగాలు వివరించే సర్వస్వాలు అవి గత చరిత్ర నెత్తురు మరకలు శాంతిసూక్తాలు ఋగ్గనాలు  వివిక్త అనాసక్త గీతాలు గాయక పండిత ముఖద్వార నిర్గత జ్ఞాన శ్రోతోమార్గాలు కొన్ని పుస్తకాలు పాతగిలిన లోగిళ్ళు  కొన్ని నాగరిక పారదర్శక స్వప్న సౌధాలు  కొన్ని పుస్తకాలు ఉపత్యకాహారిత శాద్వలాలు  కొన్ని అధీఛ్చికా  పరిచుంబిత మేఘశకలాలు  కొన్ని పుస్తకాలు గ్రీష్మావరిక్త  దూసరిత చండ మధ్యాహ్నాలు  కొన్ని ఉద్రిక్త ప్రియా స్తన పరీరంభ పరిమళాలు  కొన్ని నీరవ హేమంత సాయంతనాలు  కొన్ని విషాద నిశీధాల వెన్నెల మసకలు    గాజుబీరువా తలుపు రెక్కలు తప్పించి చూస్తే  నాలుగో పరిమాణానికి నాందీ ప్రస్తావనలు  నిలువెత్తున పలకరించే  పుస్తకాలు   కొన్ని పాతపడిన లోగిళ్ళు  కొన్ని నాగరిక పారదర్శక...